Header Banner

మందు బాబులకు వార్నింగ్! తాగిన తర్వాత తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

  Fri Feb 21, 2025 08:00        India

మందుబాబులకు ఎప్పుడూ ఒక చిక్కు ప్రశ్న ఎదురవుతుంది. మందు తాగిన తర్వాత ఫుడ్ తినాలా? లేదా తిన్న తర్వాత ఆల్కహాల్‌ తాగాలా? అని చాలామంది అడుగుతారు. దీనిపై ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. అసలు తినడం, తాగడం వెనుక ఉన్న సైన్స్‌ ఏంటో చూద్దాం. ఆల్కహాల్‌ తాగినప్పుడు అది పొట్ట, చిన్నపేగుల నుంచి వేగంగా రక్తంలోకి కలిసి పోతుంది. ఒకవేళ పొట్ట ఖాళీగా ఉంటే మాత్రం అది వెంటనే బాడీలోకి చేరిపోతుంది. దీంతో ఇన్‌టాక్సికేషన్‌ ఫాస్ట్‌గా జరుగుతుంది. ఫలితంగా మరింత తాగాలనే కోరిక పుడుతుంది. ఏదైనా తిన్నాక తాగితే ఈ సమస్య ఉండదు. 

 

బాడీలోని కీలక విటమిన్లు, మినరల్స్‌ను ఆల్కహాల్‌ దెబ్బతీస్తుంది. అందుకే తాగడానికి ముందే ఆహారం తింటే కోల్పోయిన పోషకాలు తిరిగి బాడీలోకి చేరతాయి. తద్వారా ఆల్కహాల్‌ దుష్ప్రభావాలు శరీరంపై తక్కువగా ఉంటాయి. తాగడానికి ముందే ఏదైనా తింటే.. పొట్టలో ఉన్న ఆహారం ఆల్కహాల్‌ను డైల్యూట్‌ చేస్తుంది. దీనివల్ల అది బాడీలోకి వెళ్లే వేగం తగ్గుతుంది. ఫలితంగా ఆల్కహాల్‌ను డైజెస్ట్‌ చేసేందుకు సమయం దొరుకుతుంది. దీనివల్ల ఇన్‌టాక్సికేషన్‌ జరగదు. పోటీన్లు, ఫ్యాట్స్‌, ఫైబర్‌ ఉండే ఆహార పదార్థాలు పొట్టలో గోడలా పనిచేస్తాయి. దీనివల్ల ఆల్కహాల్‌ అంత త్వరగా బాడీలోకి వెళ్లదు. రక్తంలోకి ఆల్కహాల్‌ చేరే ప్రక్రియను ఈ పోషకాలు నియంత్రిస్తాయి. ఫలితంగా ఆల్కహాల్‌ దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. 

 

అరటి పండ్లు మంచి ఆప్షన్‌. ఆల్కహాల్‌ వల్ల డీహైడ్రేషన్‌ అవుతుంది. అరటిలో ఉండే వాటర్‌, ఫైబర్‌, పొటాషియం వల్ల డిహైడ్రేషన్‌ ప్రాబ్లమ్‌ ఉండదు. ఇతర పోషకాలు సైతం మొత్తంగా డ్రింకింగ్‌ సమయంలో బాడీని హెల్తీగా ఉంచుతాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కీరదోస, టమాట, బెల్‌ పెప్పర్స్‌, ర్యాడిష్‌ వంటివి తినడం మంచిది. ఇవి ప్రీడ్రింక్‌ స్నాక్‌గా తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే నట్స్‌, అవకాడో, చీజ్‌ వంటి హెల్తీ ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్‌ తినాలి. ఇవి బాడీకి ఎనర్జీని ఇచ్చి తాగుతున్నంత సేపు కడుపులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాయి. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆల్కహాల్‌ బాడీలోకి అంత వేగంగా చేరొద్దంటే కనీసం 15 నిమిషాల ముందు తినాలి. తిన్న వెంటనే తాగితే మాత్రం ప్రయోజనం ఉండదు. ఆల్కహాల్‌ వేగంగానే రక్తంలోకి చేరిపోయి దుష్ప్రభావాలను కలగజేస్తుంది. దీంతో తాగడానికి ముందు తినడం వల్ల ఉపయోగం లేదు. అందుకే తిన్న ఆహారం డైజెస్ట్‌ అయ్యే ప్రాసెస్‌ స్టార్ట్‌ అయ్యే వరకు ఆగాలి. ఒకవేళ తింటూ తాగాలని ఫిక్స్‌ అయితే మాత్రం.. సాల్టీ స్నాక్స్‌ జోలికి వెళ్లొద్దు. ఉప్పగా ఉండే ఫుడ్స్‌ కారణంగా దాహం వేస్తుంది. దీంతో మరింత ఆల్కహాల్‌ తాగాలి అనిపిస్తుంది. అందుకే తాగేటప్పుడు మధ్యలో వాటర్ సిప్ చేస్తే, బాడీ హైడ్రేట్‌ అవుతుంది. 

 

బాగా తాగిన తర్వాత ఎక్కువ మొత్తంలో వాటర్‌ తాగితే హ్యాంగోవర్‌ సమస్య ఉండదని చాలా మంది అనుకుంటారు. అలాగే డ్రింక్ చేసిన తర్వాత తినడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదని అధ్యయనాలు తేల్చాయి. దీనివల్ల కొంత వరకు డీహైడ్రేషన్‌ ప్రాబ్లమ్‌ తగ్గినప్పటికీ.. ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమాత్రం తగ్గవని అధ్యయనాలు చెబుతున్నాయి. 

 

తిన్న తర్వాత తాగితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవంటే అర్థం, అవి తక్కువ స్థాయిలో ఉంటాయని మాత్రమే. అలా అని తిని ఎంతైనా తాగొచ్చని ఫిక్స్‌ కావొద్దు. ఏదైనా అతి అయితే మంచిది కాదు. మీ ఆరోగ్యాన్ని బట్టి, డాక్టర్ల సలహా ప్రకారం ఎంత లిమిట్‌లో తాగితే ప్రాబ్లమ్ ఉండదో తెలుసుకోవాలి. లేదంటే హార్ట్‌, కిడ్నీ, లివర్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Alcohol #Beer #EmptyStomach